- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పురంధేశ్వరిపై బీజేపీ అధిష్టానం ఆగ్రహం.. అభ్యర్ధుల లిస్టుపై అసహనం.. !
దిశ, వెబ్ డెస్క్: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై ఆ పార్టీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ ఏపీ అభ్యర్థుల విషయంలో అసహనం చేశారని సమాచారం అందుతోంది. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే 175 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి -10, జనసేన 21, టీడీపీ -144 కేటాయించారు. అటు పార్లమెంట్ స్థానాలను కూడా ఖరారు చేశారు. బీజేపీ-6, టీడీపీ-17, జనసేన -2 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. దీంతో అసెంబ్లీకి సంబంధించి రెండు అభ్యర్థుల జాబితాను టీడీపీ ప్రకటించింది. మిగిలిన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అటు పార్లమెంట్‌కు సంబంధించి అభ్యర్థుల లిస్టును విడుదల చేయాల్సి ఉంది.ఇక జనసేన కూడా అసెంబ్లీ అభ్యర్థుల తొలి లిస్టును విడుదల చేసింది. ఒక పార్లమెంట్ స్థానంలో తమ అభ్యర్థిని ప్రకటించింది.
అయితే ఏపీ బీజేపీ మాత్రం ఇప్పటివరకూ ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. ఇప్పటికే 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లను పరిశీలించి ఫైనల్ చేశారు. ఈ అభ్యర్థుల జాబితాను రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి బీజేపీ హైకమాండ్‌కు అందజేశారు. అంతేకాదు ఫైనల్ చేయంచేందుకు మూడు రోజులుగా ఆమె ఢిల్లీలోనే మకాం వేశారు. బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తమ అభ్యర్థుల జాబితాను ఆమె విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
కాగా అభ్యర్థుల విషయంలో ఓ కీలక విషయం విశ్వసనీయ వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితాపై ఆ పార్టీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పురంధేశ్వరి అందజేసిన లిస్టులోని అభ్యర్థులు.. గతంలో టీడీపీలో పని చేసి బీజేపీలోకి చేరిన వారేనని అసహనం వ్యక్తం చేశారని సమాచారం. అందుకే పురంధేశ్వరి మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నా ఏపీ అభ్యర్థుల లిస్టుకు మాత్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదనే ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు ఏపీలో బీజేపీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు బీజేపీ హైకమాండ్ అనుమానం వ్యక్తం చేసిందట. టీడీపీ, జనసేనతో పొత్తుకు ఓ వర్గం ఓకే చెబితే మరో వర్గం ఇప్పటి వరకూ కూడా ఒప్పుకోవడం లేదనే విషయాన్ని గుర్తించిందట. ఎవరైతే పొత్తుకు ఒప్పుకోలేదో వారే ఏపీ బీజేపీ లిస్టుపై హైకమాండ్ వద్ద అభ్యంతరం వ్యక్తం చేశారట. దీంతో ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించి వెళ్లిన తర్వాత బీజేపీ హైకమాండ్ స్వరం మార్చినట్లు తెలుస్తోంది.. ఉమ్మడిగా నిర్వహించిన సభలో బీజేపీ నేతలు, కార్యకర్తలు చాలా తక్కువగా కనిపించారని అసహనం చేసిందట. అటు టీడీపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో బీజేపీ అభ్యర్థుల లిస్టును పెండింగ్‌లో పెట్టిందట. ఇందులో భాగంగా బీజేపీ అభ్యర్థుల లిస్టు ఆలస్యం చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. మరి బీజేపీ అభ్యర్థుల లిస్టుపై బీజేపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటో చూడాల్సి ఉంది.
Read More..
గందరగోళంగా పోలవరం సీటు.. తెరపైకి కొత్త ముచ్చట.. షాక్ లో కార్యకర్తలు