- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ ట్విస్ట్.. వైసీపీ మూడో లిస్ట్ వాయిదా
దిశ, వెబ్ డెస్క్: కొత్త ఇంచార్జుల వైసీపీ మూడో లిస్ట్ వాయిదా పడింది. మరికాసేపట్లో లిస్ట్ విడుదల చేస్తారనుకున్న సమయంలో వైసీపీ అధిష్టానం ట్విస్ట్ ఇచ్చింది. మరికొన్ని స్థానాల్లో స్పష్టత రాకపోవడంతో జాబితాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటన వెలువడింది.
మూడో జాబితాపై కసరత్తు
కాగా ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసిన అధిష్టానం తాజాగా మరో జాబితాపై కసరత్తు చేసింది. పలు అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జిలను నియమించడంపై ఫోకస్ చేసింది. మరో 29 నియోజకవర్గాల్లో ఇంచార్పులను మార్చాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు నేతలతో పలు దఫాలుగా చర్చించిన ఆయన కర్నూలు, కృష్ణా, ప్రకాశం, విశాఖ జిల్లాలకు చెందిన కొత్త జాబితాను రెడీ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో కొత్త ఇంచార్జుల నియమకాన్ని పూర్తి చేశారు. అధికారిక ప్రకటనే తరువాయి భాగంగా ఉంది. అయితే మరికొన్ని నియోజకవర్గాల్లో పంచాయితీలు తెగడంలేదని సమాచారం. దీంతో మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పూర్తి పరిశీలన తర్వాత కొత్త లిస్టును రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు కొత్త ఇంచార్జుల ప్రకటనను వాయిదా వేస్తున్నట్లు వైసీపీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఎప్పుడు విడుదల చేస్తారనేది స్పష్టం చేయలేదు.
అసెంబ్లీ పరిధిలో వీరికి దాదాపు ఖరారు..!
అనకాపల్లి అసెంబ్లీ-కిలారు పద్మ
ఆలూరు వైసీపీ ఎమ్మెల్యేగా విరూపాక్షి
దర్శి అసెంబ్లీ-శివప్రసాద్‌రెడ్డి
రాయదుర్గం- మెట్టు గోవిందరెడ్డి
మడకశిర-శుభకుమార్
గూడురు ఎమ్మెల్యే అభ్యర్థిగా మెరుగు మురళి
గంగాధర నెల్లూరు- కృపాలక్ష్మి
చింతలపూడి-విజయరామరాజు
మార్కాపురం పురం- జంకె వెంకటరెడ్డి
పార్లమెంట్ పరిధిలో..
విజయనగరం పార్లమెంట్- చిన్న శ్రీను
కర్పూలు ఎంపీగా మంత్రి జయరాం
విశాఖ పార్లమెంట్- బొత్స ఝాన్సీ
Read More..
వ్యక్తిగత వాహనాలతో వ్యాపారం.. కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా మంత్రికి విజ్ఞప్తి