- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీకి బిగ్ షాక్.. పార్టీకీ కీలక నేత గుడ్ బై!
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి షాక్ తగలనుంది. ఈ మేరకు విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని సోషల్ మీడియా ఎక్స్(టిట్టర్) వేదికగా సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే తన లోక్‌సభ సభ్యత్వంతో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తన అవసరం లేదని భావించిన తర్వాత ఇక ఆ పార్టీలో కొనసాగడం భావ్యం కాదని భావిస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. ఫేస్‌బుక్ వేదికగా నిన్న ఎంపీ కేశినేని నాని ఒక పోస్ట్ పెట్టారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు చెప్పారని నాని తెలిపారు. ఈ మేరకు తనకు గురువారం సాయంత్రం టీడీపీ నేతల ఆలపాటి రాజా, నెట్టేం రఘురాం, కొనకళ్ల నారాయణ వచ్చి చెప్పారని వివరించారు. తిరువూరులో చంద్రబాబు పాల్గొనే సభా నిర్వహణ బాధ్యతలను కూడా వేరే వారికి అప్పగించినట్లు చెప్పారని కూడా పేర్కొన్నారు. తనను జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పారని నాని తెలిపారు. ఈ క్రమంలోనే నేడు రాజీనామా చేయబోతున్నట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.