- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: జనసేనకు బిగ్ షాక్... మహిళా నేత రాజీనామా, కంటతడి
దిశ, వెబ్ డెస్క్: కాకినాడలో జనసేనకు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మేయర్ పోసపల్లి సరోజ రాజీనామా చేశారు. కాకినాడ ఎమ్మెల్యే సీటును ఆశించిన ఆమె జనసేన లిస్టులో పేరు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సీటు రాకపోవడంతో కంటతడి పెట్టారు. జనసేన పార్టీ ఒక కార్పొరేట్ కంపెనీలా మారిందని వాపోయారు. అంతేకాకుండా పార్టీలో మహిళలకు విలువ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్లపై సరోజ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాదెండ్ల పర్మిషన్ ఉంటేనే తప్ప అధినేత పవన్ కల్యాణ్ కలవలేమని సరోజ ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు వీరే..
కాగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను జనసేన విడుదల చేసింది. టీడీపీ, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ సీట్లు దక్కగా.. అందులో 18 స్థానాలకు అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేసింది. మరో మూడు స్థానాలకు అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టింది.
1.పిఠాపురం : పవన్ కళ్యాణ్
2. నెల్లిమర్ల: లోకం మాధవి
3. అనకాపల్లి:కొణతాల రామకృష్ణ
4. కాకినాడ రూరల్: పంతం నానాజీ
5.రాజానగరం: బత్తుల బలరామకృష్ణ
6.తెనాలి: నాదెండ్ల మనోహర్
7.నిడదవోలు: కందుల దుర్గేష్
8.పెందుర్తి: పంచకర్ల రమేష్ బాబు
9.యలమంచిలి: సుందరపు విజయ్ కుమార్
10.పి.గన్నవరం: గిడ్డి సత్యనారాయణ
11.రాజోలు: దేవ వరప్రసాద్
12.తాడేపల్లిగూడెం: బొలిశెట్టి శ్రీనివాస్
13.భీమవరం: పులపర్తి ఆంజనేయులు
14.నరసాపురం: బొమ్మిడి నాయకర్
15. ఉంగుటూరు: పత్సమట్ల ధర్మరాజు
16.పోలవరం: చిర్రి బాలరాజు
17.తిరుపతి: ఆరణి శ్రీనివాసులు
18.రైల్వే కోడూరు: డా.యనమల భాస్కర రావు