YS వివేకా కేసు : అవినాష్ రెడ్డికి సుప్రీంలో బిగ్ షాక్!

by Sathputhe Rajesh |   ( Updated:22 May 2023 6:22 AM  )
YS వివేకా కేసు : అవినాష్ రెడ్డికి సుప్రీంలో బిగ్ షాక్!
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంలో షాక్ తగిలింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు స్వీకరించలేదు. బెయిల్ పిటిషన్ ను విచారించలేమని వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. మెన్షనింగ్ లిస్టులో ఉంటేనే విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. రేపు మెన్షనింగ్ అధికారులను కలవాలని అవినాష్ రెడ్డికి బెంచ్ సూచించింది. కాగా ఈ రోజు ఉదయం విశ్వభారతి ఆసుపత్రి వద్దకు సీబీఐ అధికారులు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీబీఐ సమన్లు జారీ చేస్తుందా లేక అరెస్ట్ చేస్తుందా అనే దానిపై హై టెన్షన్ నెలకొంది.

Read more:

అవినాష్ రెడ్డి తల్లి హెల్త్ బులెటిన్ విడుదల.. CBI అధికారుల రాకతో హైటెన్షన్

Advertisement

Next Story

Most Viewed