గ్రూపు-2 అభ్యర్థులకు BIG అలర్ట్.. ఎగ్జామ్ సెంటర్ వద్ద ఏ టైమ్‌కు ఉండాలో తెలుసా?

by Gantepaka Srikanth |
గ్రూపు-2 అభ్యర్థులకు BIG అలర్ట్.. ఎగ్జామ్ సెంటర్ వద్ద ఏ టైమ్‌కు ఉండాలో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రూపు-2 మెయిన్స్ పరీక్ష(Group-2 Exam)పై వస్తున్న వదంతులను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(APPSC) కొట్టిపారేసింది. వాయిదా వేయట్లేదని.. అనుకున్న తేదీన పరీక్ష జరిగి తీరుతుందని శనివారం సాయంత్రం అధికారిక ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే అభ్యర్థులకు ఏపీపీఎస్సీ పలు కీలక సూచనలు చేసింది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్- 1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్ - 2 పరీక్ష ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందే సెంటర్ వద్దకు రావాలని సూచించింది. మొత్తం 92 వేల 250 మంది మెయిన్స్ పరీక్ష రాయబోతున్నారు. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 175 సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

కాగా, అంతకుముందు.. రోస్టర్‌ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం సైతం తమ ఆవేదనను అర్థం చేసుకొని పరీక్షను కొద్ది రోజులు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ కార్యదర్శికి లేఖ రాసింది. అయినా పట్టించుకోకుండా.. పరీక్షలు నిర్వహించడం సరికాదని అభ్యర్థులు అసహనం వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ మాత్రం షెడ్యూల్‌ ప్రకారం పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

Next Story