Big Breaking:టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు

by Jakkula Mamatha |   ( Updated:2024-07-08 12:05:16.0  )
Big Breaking:టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ కి సిద్ధమైన ఏపీ ప్రభుత్వం టెట్ పరీక్షను మరోసారి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) షెడ్యూల్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇటీవల టెట్ అభ్యర్థులు ప్రిపరేషన్‌కు మరింత గడువు ఇవ్వాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయగా ప్రభుత్వం స్పందించింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు టెట్, డీఎస్సీ కి సన్నద్ధమయ్యేందుకు మరింత గడువు ఇస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో జులై 2వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ ఎగ్జామ్ జరగాల్సి ఉండగా, ఆ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని తెలిపింది. అయితే ప్రిపరేషన్‌కు సమయం కోసం అభ్యర్థుల వినతి మేరకు నోటిఫికేషన్‌ను సవరణ చేసి ఈ రోజు (సోమవారం) సాయంత్రం విడుదల చేసింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

టెట్ కొత్త షెడ్యూల్ ఇదే..

నోటిఫికేష‌న్ రిలీజ్: జులై 2

ప‌రీక్ష ఫీజు చెల్లింపున‌కు, ద‌ర‌ఖాస్తుకు చివరి గ‌డువు: ఆగ‌స్టు 3

ఆన్‌లైన్ మాక్ టెస్టు: సెప్టెంబ‌ర్ 19 నుంచి

ప‌రీక్ష‌లు: అక్టోబ‌ర్ 3 నుంచి 20 వ‌ర‌కు (రెండు సెష‌న్ల‌లో)

ప్రాథ‌మిక కీ విడుద‌ల‌: అక్టోబ‌ర్ 4

ప్రాథ‌మిక కీపై అభ్యంత‌రాల స్వీక‌ర‌ణ‌: అక్టోబ‌ర్ 5 నుంచి

ఫైన‌ల్ కీ విడుద‌ల‌: అక్టోబ‌ర్ 27

ఫ‌లితాల విడుద‌ల‌: న‌వంబ‌ర్ 2

Advertisement

Next Story

Most Viewed