- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నామినేటెడ్ పదవుల్లోనూ బీసీ మహిళలకు స్థానం కల్పించాలి : విజయసాయిరెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో : డబుల్ మైనారిటీలైన ఎస్సీ, ఎస్టీ మహిళలతోపాటు వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు సైతం ఆయా అసెంబ్లీలలో రిజర్వేషన్ కల్పించాలని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. రాజ్యసభలో సోమవారం జమ్మూ, కశ్మీర్, పుదుచ్చేరి శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుపై చర్చ జరిగింది. ఈ చర్చలో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మాట్లాడారు. బీసీ మహిళలకు రిజర్వేషన్‌ను విస్మరించడం తగదని అన్నారు.‘డబుల్ మైనారిటీలైన ఎస్సీ, ఎస్టీ మహిళలతోపాటు వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు సైతం ఆయా అసెంబ్లీలలో రిజర్వేషన్ కల్పించాలని కేంద్రప్రభుత్వానికి ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. బీసీ మహిళలకు రిజర్వేషన్‌ను విస్మరించడం తగదని చెప్పుకొచ్చారు.అలాగే నామినేటెడ్ పదవుల్లోను బీసీ మహిళలకు స్థానం కల్పించాలని కోరుతూ వైసీపీ తరఫున ఆ బిల్లుకు ఎంపీ విజయసాయిరెడ్డి మద్దతు ప్రకటించారు.