అంగన్ వాడి పోస్టులకు బేరసారాలు.. నియామకాలపై ఆరోపణలు

by Vinod kumar |
అంగన్ వాడి పోస్టులకు బేరసారాలు.. నియామకాలపై ఆరోపణలు
X

దిశ, ప్రతినిధి, కడప: జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకల్లో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తున్నారు. ఉద్యోగ నియామకాలపై ఆరోపణలకు తావు లేకుండా జరుగుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చి త్వరలో నియామకం జోరుగబోతున్న అంగన్వాడీ నియామకాలపై విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే ఆ పోస్టులు కట్టబెట్టే ప్రయత్నాలకు రంగం సిద్దమౌతున్నట్లు సమాచారం. ఇదే అదునుగా కొందరు అధికార పార్టీ నాయకులు అంగన్వాడి టీచర్లతో పాటు ఆయా ఫాస్టులకు లక్షల్లో వసూలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

52 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్..

జిల్లాలో ఖాళీగా ఉన్న 12 అంగన్వాడీ కార్యకర్తలు, 40 ఆయా, 4 మినీ అంగన్వాడి పోస్టుల భర్తీ కోసం ఏప్రిల్ 23న జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసి, మే 3వ తేదీ దరఖాస్తుకు చివరి గడువు విధించి 9న ఇంటర్వ్యూలు నిర్వహించబోతోంది. విద్యార్హతతో పాటు ఇంటర్వ్యూ మార్కును కలిపి మొత్తం 100 మార్కులకు గాను విద్యారహతకు 50 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, ఇద్దరు చిన్న పిల్లలు కలవారికి 5 మార్కులు, అనాధలకు 10 మార్కులు, మిగిలిన 30 మార్కులను ఇంటర్వ్యూ చేసే అధికారులు నిర్ణయిస్తారు.

స్థానిక ఎమ్మెల్యే చైర్మన్ గా, ఆర్డిఓ కన్వీనర్ గా పోస్టుల నియామకం జరుగుతాయి. అయితే ఇప్పటికే అధికార పార్టీ నేతలు దరఖాస్తుదారుల నుండి అంగన్వాడీ కార్యకర్తకు ఐదు లక్షలు, ఆయా పోస్టుకు రెండు లక్షలు వసూలు చేశారన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు ఎంపిక చేసిన జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 9న జరిగే ఇంటర్వ్యూ కేవలం మొక్కుబడిగా జరిపి అధికార పార్టీ స్థానిక నేతలకు లబ్ధి చేకూర్చేబోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

రీ నోటిఫికేషన్ ఇవ్వాలి..

వ్యవహారంలో లక్షలు చేతులు మారాయని ప్రస్తుత నోటిఫికేషన్ రద్దుచేసి రీనాటిఫికేషన్ ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర కోరారు. అధికారులు నిర్వహించే ఇంటర్వ్యూ మార్కులు పూర్తిగా రద్దుచేసి పదవ తరగతి మార్కుల ఆధారంగా, అదనపు అర్హతల ఆధారంగా ఎంపిక చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed