- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన బైరెడ్డి.. సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
దిశ, కర్నూలు ప్రతినిధి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుపై రాయలసీమ స్టీరింగ్ కమిటీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి స్పందించారు. రాష్ర్టంలో శాడిజం మొదలైందని, రాజ్యాంగానికి లోబడి కాకుండా చేసిన ప్రమాణాలకు విరుద్ధంగా రాగద్వేషాలతో పాలన సాగుతోందని, అందులో భాగంగానే చాలా అనుభవం ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం అందుకు నిదర్శనమని దుయ్యబట్టారు. కర్నూలు జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాలు వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ర్ట విభజన తర్వాత చాలా చమటోడ్చి రాష్ర్టాన్ని ముందుకు అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు చంద్రబాబు అన్నారు. అలాంటి నాయకుడిపై కేవలం కక్ష సాధింపు చర్యలకు పాల్పడి వివిధ కేసుల పేరుతో జైలుకు పంపడం దుర్మార్గమన్నారు. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత రాష్ర్టం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, అప్పులతో రాష్ర్టం నడుస్తోందన్నారు.
మూడు రాజధానుల పేరుతో రాజధాని లేని రాష్ర్టంగా చేసిన ఘనత జగన్‌కు దక్కుతుందన్నారు. రాష్ర్టం చిన్నా భిన్నమైనా పట్టించుకోవడంలేదు. సీనియర్ సిటిజన్లు, సీనియర్ రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. లేకుంటే అక్రమ కేసులు బనాయించే అవకాశం ఉందన్నారు. జగన్ ప్రజల సంక్షేమాన్ని విస్మరించి కక్ష సాధింపు చర్యలతో ముందుకెళ్లడం దురదృష్టకరమన్నారు. ఇదే క్రమంలో జర్నలిజంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన సీనియర్ సిటిజన్ రామోజీరావును అరెస్టు చేసేందుకు పాత కేసులు వెలికి తీయడం జగన్ నిరంకుశ పాలనకు పరాకాష్ట అన్నారు. అనుభవం లేని నాయకుడు జగన్ అని, ఎంతో అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు అని అన్నారు.
రూ.290 కోట్లు అంటే దేశంలో ఉండే నాయకులకు అది ఒక పాకెట్ మనీగా అభివర్ణించారు. ఏపీలో పాలన పట్టాలు తప్పింది. ప్రస్తుతం దేశంలో జమిలీ ఎన్నికల ప్రస్తావన వచ్చింది. 75 స్వాతంత్ర్య భారతావనిలో జమిలీ ఎన్నికలొస్తే రానున్న రోజుల్లో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉందని, ఇప్పటికే పాలకుల వల్ల అనేక మార్పులొచ్చాయని, ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉందని ఆయన అన్నారు. ఈ సమయంలో ఎలాంటి మార్పులైనా జరిగే అవకాశం ఉందని తెలియజేశారు. ఏదేమైనా చంద్రబాబు అరెస్టు అక్రమమని, ఇప్పటికైనా రాష్ర్ట ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించాలని హితవు పలికారు.