అక్రమ నిర్మాణదారులకు బ్యాడ్ న్యూస్.. మున్సిపల్ శాఖ కీలక గైడ్ లైన్స్..!

by srinivas |
అక్రమ నిర్మాణదారులకు బ్యాడ్ న్యూస్.. మున్సిపల్ శాఖ కీలక గైడ్ లైన్స్..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మున్సిపల్ శాఖ(AP Municipal Department) కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ నిర్మాణాల(Illegal structures)పై ఉక్కుపాదం మోపేందుక సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇళ్ల నిర్మాణాల అనుమతిని తప్పనిసరి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు పెరుగుతున్న నేపథ్యంలో కీలక గైడ్ లైన్స్‌ను సైతం విడుదల చేసింది. ఆక్యుపేషన్ సర్టిఫికెట్‌పై భవన యజమానుల వద్ద అండర్ టేకింగ్ తీసుకోవాలని అధికారులను మున్సిపల్ శాఖ ఆదేశించింది. బిల్డింగ్ ప్లాన్, నిర్మాణాలను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని సూచింది. ప్లాన్ మేరకు నివాసాలు నిర్మించేలా చూడాలని చెప్పింది. అలాలేకపోతే నివాసయోగ్యపత్రం జారీ చేయకూడదని ఆదేశించింది. ఆ పత్రం లేనియెడల తాగు నీరు, డ్రైనేజీ, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయాలని తెలిపింది. అంతేకాదు బ్యాంకుల నుంచి రుణాలు కూడా రాకుండా చేయాలని అధికారులను ఆదేశించింది.

కాగా గత ప్రభుత్వంలో రాష్ట్రంలో చాలా చోట్ల అక్రమ నిర్మాణాలు జరిగాయని విమర్శలు వెల్లవెత్తిన విషయం తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పలుచోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అనుమతులు లేకుండా నిర్మించిన పలువురు నాయకుల కట్టడాలను సైతం కూల్చివేసింది. విశాఖ వంటి సిటీల్లోనూ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. ఇప్పుడు అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అనుమతి లేని నిర్మాణాలపై తాజాగా మున్సిపల్ శాఖ గైడ్ లైన్స్‌ను విడుదల చేసింది. దీంతో ఇప్పటికే అక్రమంగా నిర్మించిన భవన యాజమానులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మున్సిపల్ శాఖ గైడ్ లైన్స్‌తో రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Next Story