బాలకృష్ణ సాక్షిగా బాబు-పవన్ ప్యాకేజీ డీల్: మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి

by Seetharam |
బాలకృష్ణ సాక్షిగా బాబు-పవన్ ప్యాకేజీ డీల్: మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అని మంత్రి కాకాణి గోవర్థణ్ రెడ్డి అన్నారు. లేకపోతే చంద్రబాబు నాయుడుకు ఎప్పుడో 15 ఏళ్ళు జైలు శిక్ష పడి ఉండేదని అన్నారు. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ అన్ని ఆధారాలతో కోర్టు ముందు ఉంచింది. చివరికి సోమిరెడ్డి లాంటి వ్యక్తులు కూడా చంద్రబాబు పని అయిపోయిందంటున్నారని విమర్శించారు. చంద్రబాబు మీద ఆధారాలున్నా.. శిక్ష వేయకూడదు.. శిక్షిస్తే.. మాత్రం న్యాయమూర్తులను, న్యాయవాదులను వదలము అని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు అని మండిపడ్డారు. దోషి అయిన చంద్రబాబును నిర్దోషిగా చూపించాలనే తపనతో రాజ్యాంగాన్ని టీడీపీ నాయకులు ఉల్లంఘిస్తున్నారు అని మండిపడ్డారు. మరోవైపు బాలకృష్ణ సాక్షిగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో బాబు-పవన్ ప్యాకేజీ డీల్ కుదిరిందని.. పవర్ స్టార్‌ ప్యాకేజీ స్టార్ అయిపోయాడు అని ఆరోపించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం కాకాణి గోవర్థన్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. సంస్కారం ఉన్నవాడెవడైనా జైలులో డీల్ కుదుర్చుకుంటాడా? అని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని చంద్రబాబు వేల కోట్ల అవినీతి చేశాడు.. ప్రజాధనాన్ని కొల్లగొట్టి జైలుకు వెళ్లారు. చంద్రబాబు అరెస్టుపై... న్యాయవాదులు, తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిపై టీడీపీ దుష్ప్రచారమేంటి? అని కాకాణి ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థలను టీడీపీ అవమానించడం సరికాదు. ఓటుకు నోటు కేసులో అరెస్టు చేస్తారనే బాబు పారిపోయి ఏపీకి వచ్చాడు అని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆరోపించారు.

లోకేశ్ ఢిల్లీ టూర్ ప్లాప్

ఢిల్లీలో నారా లోకేశ్ అజ్ఞానం కనిపించింది.. లోకేశ్‌ ఢిల్లీ యాత్ర అట్టర్ ఫ్లాప్‌ అని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. స్కిల్ స్కామ్ కేసులో జాతీయ మీడియాకు కూడా లోకేశ్‌ ఏమీ చెప్పలేకపోయాడు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబును బయటకు తెచ్చేందుకు ఏ లాయర్లను పెట్టుకోవాలనే ఢిల్లీలో లోకేశ్‌ చర్చలు జరిపారని అన్నారు. ఢిల్లీలో న్యాయవాదుల చుట్టూ లోకేశ్ తిరిగారని విమర్శించారు. స్కిల్‌ స్కాంలో లోకేశ్‌ కూడా ఉన్నాడని చంద్రబాబు కుటుంబమే భావిస్తోంది. స్కిల్‌స్కాం గురించి చంద్రబాబు కుటుంబానికి తెలుసు కాబట్టే.. లోకేశ్‌ను అరెస్ట్ చేస్తారనుకుంటున్నారు అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.

జైల్‌ సూపరింటెండెంట్ సెలవునూ వక్రీకరిస్తారా?

రాజమండ్రి జైల్‌ సూపరింటెండెంట్ రాహుల్ భార్య అనారోగ్యం పాలైంది. దీంతో జైల్‌ సూపరింటెండెంట్ రాహుల్ సెలవు మీద వెళ్తే ఎల్లో మీడియాలో వక్రీకరించి చూపించారు అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. చివరికి జైల్ సూపరింటెండెంట్ భార్య అనారోగ్యంతో మృతి చెందారు. తర్వాత పచ్చ మీడియా ఎలా రాస్తోందో ప్రజలకు అర్థమైంది. సూపరింటెండెంట్ భార్య అస్వస్థతతో సెలవు పెడితే.. ప్రభుత్వానికి ముడిపెడుతూ పచ్చ మీడియా దిగజారిపోయింది. ఇంతకంటే.. దౌర్భాగ్య పరిస్థితులు మరొకటి ఉండదు అని హెచ్చరించారు.

పవర్ స్టార్‌ కాస్త ప్యాకేజీ స్టార్ అయిపోయాడు.

యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తానని చంద్రబాబు తన నైపుణ్యంతో డబ్బులు కొట్టేశాడు. నిర్మాతల దగ్గర రెమ్యునరేషన్‌ తీసుకుని కెమెరా ముందు నటించే పవన్ కల్యాణ్‌ చంద్రబాబు దగ్గర ప్యాకేజీలు తీసుకుని ప్రజల దగ్గర మాట్లాడుతున్నాడు అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి విమర్శించారు. ఇద్దరి మధ్య తేడా ఏమీ లేదు అని చెప్పుకొచ్చారు. సంస్కారం ఉన్నవాడు ఎవడైనా జైలులో డీల్ మాట్లాడుకుంటారా? చంద్రబాబు, లోకేశ్ మీద నమ్మకం లేదని బాలకృష్ణను మధ్యవర్తిగా పెట్టుకుని పవన్ జైలులో డీల్ మాట్లాడుకున్నాడు అని ఆరోపించారు. 2014-19 చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డాడని పవన్ కల్యాణ్ నాడు చెప్పాడు. చంద్రబాబుకు మద్దతు ఇస్తే లోకేశ్ తన తల్లిని దూషించారని, వారి అంతు చూస్తానని పవన్ హెచ్చరించలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తానని చెబుతున్నాడు. జనం అంతా జగన్ వెంట ఉంటే.. జనసేనాని చంద్రబాబుతో పోయాడు. పైగా నాలుగు శాతం కూడా ఓట్లు లేని పవన్ కల్యాణ్. .. వైఎస్‌ఆర్‌సీపీని అడ్డుకుంటానని చెప్పడం ఏమిటి? అని నిలదీశారు. బలం, బలగం ఉంటే పవనే అధికారంలోకి వచ్చి ఉండేవాడు. పవన్ కల్యాణ్‌కు రాజకీయ పరిణితి లేదు అని అన్నారు. పవర్ స్టార్‌ కాస్త ప్యాకేజీ స్టార్ అయిపోయాడు అంటూ తీవ్ర వ్యాక్యలు చేశారు. తన పాలనలో మీకు మేలు జరిగితే ఓటు వేయండని అడగగలిగిన ధీరుడు సీఎం జగన్ మోహన్‌ రెడ్డి మాత్రమేనని చెప్పుకొచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఎవరో ఒకరితో పొత్తుకు వెళ్లి వాళ్ల భుజాల మీద ఎక్కి ఊరేగుదామనుకుంటున్నాడని మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌ ప్యాకేజీ స్టార్‌ అని ప్రజలు నమ్ముతున్నారు అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed