- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Congress: అమిత్ షా ఆరోపణలపై సీఎం జగన్ సమాధానం చెప్పాలి: జంగా గౌతమ్
దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వైసీపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు సీఎం వైఎస్ జగన్ సమాధానం చెప్పాలని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ డిమాండ్ చేశారు. జగన్ పాలన పూర్తిగా అవినీతిమయమని, మైనింగ్, భూదందాలు, నకిలీ మందుల వ్యాపారం, అవినీతి కుంభకోణాలు తప్ప మీరేమీ లేదంటూ సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారని అన్నారు. అంతేకాదు కేంద్రం ఇచ్చిన నిధులన్నీ జగన్ అవినీతి కేడర్ స్వాహా చేస్తున్నదని కేంద్ర హోం మంత్రి చెప్పడం రాష్ట్ర ప్రజల్లో చాలా అనుమానాలకు తావిస్తున్నాన్నారు. కాబట్టి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపణలపై ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
ఏపీలో 25 ఎంపీలకు గానూ 20 ఎంపీ సీట్లను బీజేపీ - ఎన్డీఏ పక్షాలని గెలిపించాలని అమిత్ షా అభ్యర్థించడంపై జంగా గౌతమ్ మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా అమలు కాకుండా, ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టాన్ని అమలు చేయకుండా ద్రోహం చేసిన బీజేపీని రాష్ట్ర ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యే పార్టీలను కూడా ఎన్నికల్లో మట్టి కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా బీజేపీతో అంట కాగుతున్నాయని ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గ్రహించి బీజేపీతో రాజీలేకుండా పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని జంగా గౌతమ్ కోరారు.
ఇవి కూడా చదవండి:
CPI: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీబీఐపై కె రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు