AP: అనంతపురం జిల్లాలో దారుణం.. పాత మిద్దె కూలి ముగ్గురు దుర్మరణం

by Ramesh Goud |   ( Updated:2024-12-04 04:46:11.0  )
AP: అనంతపురం జిల్లాలో దారుణం.. పాత మిద్దె కూలి ముగ్గురు దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Anantapur District)లో దారుణ ఘటన(Tragic Incident) చోటు చేసుకుంది. పాత మిద్దె కూలి ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం(Died) పాలయ్యారు. ఫెంగల్ తుఫాన్(Cyclone Fengal) ప్రభావం కారణంగా ఇటీవల కురుస్తున్న వర్షాలకు కుందుర్పి(Kundurpi) మండలం రుద్రంపల్లి(Rudrampalli)లో పాత కాలంలో కట్టిన మట్టి మిద్దె(Old Mud House) అకస్మాత్తుగా కూలిపోయింది(Collapsed). ఆ సమయంలో కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఇంట్లో నిద్రిస్తున్నారు. కూలిన మిద్దె వారిపై పడటంతో అక్కడికక్కడే మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన గంగన్న, శ్రీదేవి, సంధ్య అని స్థానికులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం స్థానికుల సాయంతో మృతులను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed