YS Jagan: జగన్ భద్రత కుదింపుపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన

by Satheesh |
YS Jagan: జగన్ భద్రత కుదింపుపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతను కుదించినట్లు వైసీపీ ఆరోపించింది. జగన్‌కు సెక్యూరిటీ సిబ్బందిని తగ్గించడంతో పాటు ఫిట్నెస్ లేని వాహనం కేటాయించారని వైసీపీ శ్రేణులు చంద్రబాబు ప్రభుత్వం ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో జగన్ భద్రత కుదింపుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జగన్‌కు భద్రతను తగ్గించినట్లు జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించింది. జగన్‌కు ఎలాంటి భద్రతా తగ్గించలేదని క్లారిటీ ఇచ్చింది. జగన్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించడంతో పాటు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్న వాహనాన్ని కేటాయించమని వెల్లడించింది. వెహికల్ కండిషన్ చూశాకే జగన్‌కు వాహనాన్ని కేటాయించామని తెలిపింది. అయితే, ప్రభుత్వం కేటాయించిన వెహికల్‌లో కంఫర్ట్‌గా లేదని జగన్‌ వేరు కారులో వెళ్లారని స్పష్టం చేసింది.

వినుకొండలో జరిగిన హత్య ఘటన నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని జగన్ ర్యాలీలు, సభలకు అనుమతి ఇవ్వడం లేదని తేల్చి చెప్పింది. కాగా, వినుకొండలో టీడీపీ కార్యకర్త చేతిలో వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మృతి చెందిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన వాహనంలో కాకుండా సొంత కార్లో బయలు దేరారు. ప్రభుత్వం ఇచ్చిన వాహనం ఫిటెనెస్ లేదని.. అందుకే జగన్ సొంత కారులో వెళ్తున్నారని వైసీపీ పేర్కొంది. తాజాగా ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. అయితే, వినుకొండకు వెళ్లకుండా జగన్ కాన్వాయ్‌ని పోలీసులు మధ్యలోనే ఆపిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed