- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News : టీడీపీలో చేరుతున్న మాజీ ఎమ్మెల్యే
దిశ ప్రతినిధి,నరసరావుపేట: గురజాల మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి శనివారం టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. సత్తెనపల్లి లో 6వ తేదీన జరిగే ప్రజాగళం సభకు చంద్ర బాబు నాయుడు రానున్నారు. ఆ సభలో జంగా ,ఇతర ముఖ్య అనుచరులు టీడీపీ కండువా కప్పుకొనున్నారు. ఈ సందర్భంగా జంగా తన అభిమానులకు, మిత్రులకు, ప్రజలకు ఓ లేఖ రాసి విడుదల చేశారు. లేఖ లోని సారాంశం ఇలా ఉంది.పల్నాడు ప్రజలకు , ఇప్పటి దాకా నా వ్యక్తిగతంగా, పార్టీ పరంగా నా అభివృద్ధికి సహకరించిన మిత్రులకు, బడుగు బలహీన వర్గాల వారికి, విన్నపం..38 ఏళ్ళ నా రాజకీయ జీవితం... మీ అందరి భాగస్వామ్యంతో నడిచిన విషయం విధితమే.
కార్మిక నాయకునిగా నా ప్రస్థానం మొదలు పెట్టి రెండు సార్లు ఎమ్మెల్యేగా, వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షునిగా, ఎమ్మెల్సీగా మీ అందరి అభిమానంతో, సంఘటిత కృషితో మన పల్నాడు ప్రాంతాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేసుకున్నాము. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో, నియోజకవర్గంలో చోటు చేసుకున్న సంఘటనలు నా మనసును కలిచివేశాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మగౌరవం పూర్తిగా దెబ్బ కొట్టిన సంఘటనలు కోకొల్లలు..బడుగు బలహీనులకు నామమాత్రపు పదవులు అయితే ఇచ్చారు. కానీ..అధికారం మాత్రం పెత్తందారుల చేతుల్లో పెట్టారు. నామమాత్రపు పదవులు పొందిన బడుగు బలహీనులకు మరియు వైఎస్సార్సీపీకి ఓటు వేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు వారికి జరిగిన అన్యాయం చెబుతుంటే నా మనస్సు క్షోభకు గురైంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభిప్రాయం మేరకు, నా శ్రేయోభిలాషులు, సూచనల మేరకు ఒకటికి రెండుసార్లు ఆత్మగౌరవ సభలు ఏర్పాటు చేసి వారందరి అభిప్రాయాలు తీసుకున్నాను. వారందరూ ఇచ్చిన సూచనల మేరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆత్మాభిమానాన్ని కాపాడాలంటే టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నాను. ఈనెల 6వ తేదీన సత్తెనపల్లిలో నిర్వహించే ప్రజా గళం సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరడం జరుగుతుంది.కావున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు, నా శ్రేయోభిలాషులు, మిత్రులు, అభిమానులు సహకరించాలని నా చేరికను జయప్రదం చేయాలని విన్నవించుకుంటున్నానని రాశారు.
Read More..
Ap Politics:ఆ నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ వలసలు