- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రక్షించే పనిలోనే ఉన్నాం: మంత్రి గుడివాడ
దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశా రైలు ప్రమాదం ఘటనలో 178 మంది తెలుగు వారు ఉన్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఇందులో మృతులు, గాయపడ్డవారు, మిస్సింగ్ వివరాల సమాచారం కోసం అధికారులు సేకరిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ప్రమాద దుర్ఘటన స్థలానికి ముగ్గురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారుల బృందంతో కలిసి మంత్రి గుడివాడ అమర్నాథ్ వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేయమని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన వైద్య బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయని మంత్రి చెప్పారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు.
మొబైల్ ఫోన్లకు రెస్పాండ్ కాని ప్రయాణికులను గుర్తించే పనిలో ఉన్నామని, శ్రీకాకుళం పరిసర జిల్లాలో ఉన్న ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, అంబులెన్స్‌లను ఘటనా స్థలానికి పంపించాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు ఎంత ఖర్చైనా వెనకాడబోమని సీఎం చెప్పారన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి 104, 108 వాహనాలతో పాటు డాక్టర్లను కూడా తరలిస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లలో కంట్రోల్ రూమ్‌లు పనిచేస్తున్నాయన్నారు. విజయవాడలో దిగాల్సిన 39 మందిలో 23 మంది కాంటాక్ట్‌లోకి వచ్చారని వెల్లడించారు. ఐదుగురి ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో ఉన్నాయని, మరో ఇద్దరి ఫోన్లు నాట్ రిచబుల్ అని వస్తున్నాయన్నారు. ఇక మరో ఐదుగురు ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని మంత్రి వివరించారు.
ఇవి కూడా చదవండి:
Walther Division: ఒడిశా ప్రమాదం మానవతప్పిదం కాదు: డీఆర్ఎం అనూప్ కుమార్