- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
AP Legislative Council: ఏపీ శాసనమండలి వాయిదా..
దిశ, వెబ్ డెస్క్: ఏపీ శాసనమండలి (AP Legislative Council) రేపటికి వాయిదా పడింది. నేడు జరిగిన మండలి సభలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి చర్చ జరిగింది. అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని అవమానించారని మంత్రి లోకేశ్ (Minister Lokesh) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు ఎందుకు రావడం లేదని లోకేష్ ప్రశ్నించారు. గతంలో సంఖ్యాబలం తక్కువ ఉన్నా.. చంద్రబాబు సభకు వచ్చారని గుర్తు చేశారు. నా తల్లిని అవమానించిన తర్వాతనే.. చంద్రబాబు సభకు రాలేదని లోకేష్ స్పష్టం చేశారు. తాము జగన్ కుటుంబం గురించి ఏనాడూ మాట్లాడలేదన్నారు. అప్పుడు అన్ని మాట్లాడిన జగన్.. ఇప్పుడు సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.
మరోవైపు ఏపీ అసెంబ్లీలో (AP Assembly) డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ (Deputy Speaker Raghurama Krishna Raju) గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించగా.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy cm Pawan Kalyan), మంత్రులంతా కలిసి రఘురామను డిప్యూటీ స్పీకర్ ఛైర్ లో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా రఘురామ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.