- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Elections 2024: హీటెక్కిన కూటమి రాజకీయాలు..? ఆ నియోజకవర్గం బరిలో నిలిచేదెవరు..?
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి సీటు ఉత్కంఠభరితంగా మారింది. ప్రస్తుతం చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో మంత్రి బొత్స సత్యనారాణను ఓడించి చీపురుపల్లిలో టీడీపీ జెండా పాతాలని టీడీపీ అధినేత చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం.
అందుకే అభ్యర్థుల కేటాయింపు చివరి దశకు వచ్చిన చీపురుపల్లిలో మాత్రం టీడీపీ అభ్యర్థిని ప్రకటించలేదని సమాచారం. ఇక ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు బొత్సకు గట్టిపోటీ ఇచ్చే అభ్యర్థిని బరిలోదింపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బొత్సకు గట్టిపోటీ ఇచ్చే అభ్యర్థి కోసం గాలిస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే మీసాల గీతను చీపురుపల్లి నుండి దించాలి టీడీపీ అధిష్టానం సర్వే కూడా చేపట్టింది.
అయితే తాజాగా తనని టీడీపీ అధిష్టానం చీపురుపల్లి నుండి పోటీ చెయ్యమన్నదని స్వయంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ తెలియ చేసారు. ఇక గంటా చేసిన వ్యాఖ్యలు ఉత్తరాంధ్రలో చర్చనీయాంశంగా మారాయి.