- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
AP High Court: ఏపీ హైకోర్టుకు పోసాని.. తనపై కేసులు కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) ఏపీ హైకోర్టు (AP High Court)ను ఆశ్రయించారు. ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu), మంత్రి నారా లోకేష్ (Nara Lokesh), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pavan Kalyan) కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ (Quash Petition) దాఖలు చేశారు. అదేవిధంగా పాతపట్నం, సూర్యారావుపేట, కర్నూలు, అదోని టూటౌన్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని ఆ క్వాష్ పిటిషన్ (Quash Petition)లో పేర్కొన్నారు. ఆయా కేసుల్లో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు.
పోలీసులు అన్యాయంగా తనపై తప్పుడు కేసులు బనాయించారని, వారు పెట్టిన సెక్షన్లు పోసానికి వర్తించవని ఆయన తరుఫు న్యాయవాది పిటిషన్‌లో పేర్కొన్నారు. మొత్తం నాలుగు కేసులలో ఏడేళ్ల పాటు శిక్ష పడేలా సెక్షన్లను ఉన్నాయని.. ఈ నేపథ్యంలో ముందు నోటీసు ఇచ్చి పోలీసులు వివరణ తీసుకోసునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు ఏపీ హైకోర్టు (AP High Court) పోసాని క్వాష్ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టనుంది.
కాగా, పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)పై రాష్ట్ర వ్యాప్తంగా 17పైగా వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అయితే, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె (Obulavaripalle) పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి పోసానిని పోలీసులు ఫిబ్రవరి 26న అరెస్ట్ చేశారు. అనంతరం రైల్వే కొడూరు (Railway Kodur) మేజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో రాజంపేట సబ్ జైలు (Rajampet Sub Jail)కు తరలించారు. అయితే నరసరావుపేట (Narasaraopet) పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు రాజాంపేట సబ్ జైలుకు చేరుకుని పీటీ వారెంట్ (PT Warrant)పై పోసానిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం నరసరావుపేట కోర్టులో పోసానిని హాజరుపరిచారు. ఈ క్రమంలోనే పోసాని కృష్ణమురళికి ఈ నెల 13 వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పోసానిని గుంటూరు సబ్ జైలుకు తరలించగా.. మంగళవారం ఆదోని (Adoni) పోలీసులు గుంటూరు (Guntur) జైలు నుంచి అదుపులోకి తీసుకుని కర్నూలుకు తీసుకెళ్లారు. కర్నూలు (Kurnool) జడ్జి ఎదుట పోసానిని పోలీసులు హాజరుపరచగా పోసానికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం పోసాని మురళికృష్ణ కర్నూలు జిల్లా జైలులో ఉన్నారు.