- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP Govt.: విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. మరో కొత్త పథకానికి శ్రీకారం
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు 2025-26 విద్యా సంవత్సరంలో భాగంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం (Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Scheme) కింది కిట్లను పంపిణీ చేయనుంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు జారీ కాగా.. రాష్ట వ్యాప్తంగా కిట్ల పంపిణీకి రూ.953.71 కోట్ల ఖర్చు చేయనున్నారు. అందులో కేంద్ర ప్రభుత్వం (Central Government) నుంచి రూ. 175.03 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం (State Government) నుంచి రూ.778.68 కోట్లు మంజూరు చేయనుంది.
ఈ పథకం ద్వారా ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదివే 35,94,774 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. విద్యార్థుకు ఇచ్చే కిట్‌లో పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, నోటు బుక్స్, బెల్ట్, బూట్లు, బ్యాగ్, డిక్షనరీ, మూడు జతల యూనిఫాంలు ఇవ్వనున్నారు. అయితే, సగటున ఒక్కో విద్యార్థికి కిట్టు ఇచ్చేందుకు రూ.1,858 ఖర్చు అవుతోందని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా యూనిఫాంకు సంబంధించి కుట్టు కూలి కింద 1 నుంచి 8 తరగతి వరకు రూ.120, 9వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.240 ప్రభుత్వం చెల్లించనుంది.
కాగా, వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో ప్రతి సంవత్సరం జగనన్న విద్యా కానుక పథకం (Jagananna Vidya Kanuka) కింద విద్యార్థులకు కిట్లను పంపిణీ చేసేవారు. అయితే, అందులో చాలా లోపాలు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. స్కూల్ బ్యాగులు, బెల్టులపై పార్టీ రంగులు, ఫొటోలు ఉన్నట్లుగా కూటమి ప్రభుత్వం ఆరోపించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని విద్యార్థులకు కొత్త కొట్లను పంపిణీ చేయాలని మంత్రి నారా లోకేశ్, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అందుకు ఆయన ఓకే చెప్పడంతో జగనన్న విద్యా కానుక పథకం స్థానంలో కూటమి ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకానికి శ్రీకారం చుట్టబోతోంది.