- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Govt:‘పేద వర్గాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్’.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని పేదవారికి కూటమి ప్రభుత్వం(AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి(State Development) పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో నగరాల్లో నిర్మించే 100 గజాల(100 yards) లోపు గృహాలకు ప్లాన్ మంజూరు ప్రక్రియను ప్రభుత్వం మినహాయించింది. సొంతిల్లు కట్టుకోవాలని భావించే పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు కలిగించేలా నిర్ణయం తీసుకోనున్నట్లు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ(Minister Narayana) తెలిపారు. అంటే రెండు సెంట్ల లోపు ఇళ్ల నిర్మాణం(Construction of houses) చేసుకునే వారు ప్లాన్ మంజూరు కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.
ఇళ్ల నిర్మాణాని(Construction of houses)కి సంబంధించిన నిబంధనలలో పలు మార్పులు చేయాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వంద గజాల(100 yards)లోపు స్థలంలో చేపట్టే నిర్మాణాలకు ప్లాన్ మినహాయింపుతో పాటు 300 గజాల(300 yards)లోపు నిర్మాణాలకు సంబంధించి మరింత సులభతరంగా ప్లాన్ మంజూరు దిశగా చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. వీఎంఆర్‌డీఏ ప్రాజెక్టుల పురోగతిపైనా అధికారులతో చర్చించామని, పెండింగ్ పనులను తొందరగా పూర్తి చేయాలని ఆదేశించామని చెప్పారు. మాస్టర్‌ప్లాన్ రహదారుల రూపకల్పన, నిధుల సమీకరణ, మెట్రోరైలు డీపీఆర్, టిడ్కో గృహాల(Tidco Homes) పురోగతి తదితర అంశాలపై చర్చించినట్లు మంత్రి నారాయణ(Minister Narayana) పేర్కొన్నారు.