రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ స్థలం అనుమతులు రద్దు

by Mahesh |   ( Updated:2024-10-19 13:02:45.0  )
రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ స్థలం అనుమతులు రద్దు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో.. విశాఖ శారదా పీఠానికి ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ శనివారం నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖలో శారదా పీఠానికి ఇచ్చిన 15 ఎకరాల స్థలం విలువ రూ. 220 కోట్లు ఉంది. కానీ గత ప్రభుత్వం ఈ స్థలాన్ని కేవలం రూ. 15 లక్షలకు శారదా పీఠానికి కేటాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం.. దర్యాప్తు చేపించింది. దర్యాప్తులో వచ్చిన నివేదిక ఆధారంగా.. అవినీతి జరిగిందని గుర్తించిన ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ.. నిర్ణయం తీసుకుంది. కాగా దీనిపై సోమవారం ఉదయం అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే.. తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా శారదాపీఠం చేపట్టిన నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed