- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
fishermen: మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల సమయంలో మత్స్యకారులను అండగా ఉంటామని కూటమి నాయకులు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారులకు అధికారంలోకి వచ్చి రాగానే ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మత్స్యకారులకు అడ్డుగా ఉన్న జీవో 217 ను రద్దు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం తమ హయాంలో ఈ జీవో 217 ను తీసుకొచ్చి మత్స్యకారుల పొట్టకొట్టిందిన విమర్శించారు. అలాగే ఈ జీవో పేరుతో రాష్ట్రంలోని వేలాది చేరువులను వైసీపీ పార్టీ నేతలకు అప్పగించింది అని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాజాగా ప్రభుత్వం 217 జీవోను రద్దు చేయడంతో.. రాష్ట్రంలోని 3325 చిన్న తరహా సాగునీటి చెరువులు, 23,920 పంచాయతీ చెరువుల, 118 పెద్ద రిజర్వాయర్లు తిరిగి మత్స్యకార సొసైటీలకే దక్కనున్నాయి. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకార కుటుంబాల్లో ఆనందం నెలకొంది.