- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: హైకోర్టులో జగన్ పిటిషన్.. రెండు రోజుల్లో విచారణ..!
దిశ, వెబ్ డెస్క్: తనకు ప్రాణ హాని ఉందంటూ, సెక్యూరిటీ కల్పించాలని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన నివాసం వద్ద ఉన్న సెక్యూరిటీలో ప్రభుత్వం మార్పులు చేసింది. దీంతో జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు తగినంత సెక్యూరిటీ కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించారు. తనకు కేటాయించిన వాహనం కూడా సరిగాలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరమ్మతులకు గురైన వాహనాన్ని కేటాయించారని తెలిపారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు ధర్మాసనం.. మరో రెండు రోజుల్లో విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసీపీ ఘోరంగా ఓటమి చెందింది. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పాలన కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద సెక్యూరిటీని తొలగించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లిలో ఆయన ఇంటి వద్ద హై సెక్యూరిటీ ఉండేది. జగన్ ఇంటికి వెళ్లే దారిలో ఉన్న హైడ్రాలిక్ బోలార్డ్స్,టైర్ కిల్లర్స్‌తో పాటు చెక్ పోస్టులు ఉండేది. దాదాపు 310 మంది రక్షణలో జగన్ ఉండేవారు. అయితే పాలన మారడంతో పోలీస్ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనం నుంచి వచ్చిన ఫిర్యాదులతో జగన్ సెక్యూరిటీలో మార్పులు చేశారు. దీంతో తన నివాసం వద్ద జగన్ ప్రైవేటు సెక్యూరిటీని పెట్టుకున్నారు. ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ తన ఇంటి వద్ద సెక్యూరిటీ తగ్గించడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు.