- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ‘వాళ్లందరిని రాజీనామా చేయించండి’.. అధికారులకు సీఎస్ నీరబ్ కీలక ఆదేశం
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఓటమితో ప్రభుత్వ యంత్రాగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రానికి కొత్త సీఎస్‌ను నియమించిన ప్రభుత్వం.. మరి కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ యాక్షన్ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నామినేటేడ్ పదవుల్లో ఉన్నవారిని రాజీనామాలు చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యులు సమర్పించిన రాజీనామాలు తీసుకోవాలని సూచించారు. కాగా, వైసీపీ ఓటమితో ఇప్పటికే జగన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. రిజైన్ లెటర్‌ను గవర్నర్‌కు పంపించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవికి సజ్జల, టీటీడీ చైర్మన్ పోస్ట్‌కు భుమన కరుణాకర్ రెడ్డి, మరి కొందరు నేతలు ఇప్పటికే తమ రాజీనామా లేఖలను అధికారులకు సమర్పించారు.