ఏపీ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం తేదీ ఫిక్స్.. ప్రచారానికి ప్రియాంకా గాంధీ, రేవంత్

by Ramesh N |   ( Updated:2024-02-16 15:42:36.0  )
ఏపీ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం తేదీ ఫిక్స్.. ప్రచారానికి ప్రియాంకా గాంధీ, రేవంత్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది ఆసక్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ స్టేట్ చీఫ్‌గా షర్మిల పదవి చేపట్టినప్పటి నుంచి ఏపీ కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుంది. ఆ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకు వచ్చింది. ఈ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీలకు ఏపీ కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వబోతుంది. ఇప్పటికే పార్టీ ఎన్నికల బరిలో దిగేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది.

పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారానికి రెడీ!

కాంగ్రెస్ పార్టీ ఏ జిల్లా నుంచి ఎన్నికల శంఖారావాన్ని మొదలుపెట్టనుందనే విషయాన్ని పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డి ఇవాళ మీడియాకు తెలియజేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మాట్లాడి అనంతపురం జిల్లా నుంచి ఎన్నికల శంఖారావం ప్రారంభిస్తామని వెల్లడించారు. పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ నెల 26న మల్లికార్జున ఖర్గే, వైఎస్ షర్మిల, మాణిక్యం ఠాగూర్‌లతో కలసి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని ప్రకటించారు.

ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నాం: మాణిక్యం ఠాగూర్

ఈ సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ ధీమా వ్యక్తంచేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు రెడీ అయ్యిందన్నారు. ఎన్నికల ప్రచారానికి ఏఐసీసీ అగ్రనేతలు పాల్గొంటారని వివరించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశాఖపట్నం వస్తున్నారని, ఆయనతో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య కూడా వస్తారని స్పష్టంచేశారు. ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకా గాంధీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదాకు అగ్రనేత రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. తమ అజెండా చాలా క్లియర్‌గా ఉందని స్పష్టంచేశారు. మరోవైపు సీఎం జగన్ ఏపీ ప్రయోజనాలను బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని మండిపడ్డారు.

Read More..

ఏపీలో బీజేపీ నాయకుడే సీఎం కావాలి.. విష్ణువర్ధన్ రెడ్డి సంచలన డిమాండ్

Advertisement

Next Story

Most Viewed