- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభివృద్ధిలో వెనకబడిన ఏపీ.. మాజీ ఎంపీ మురళీ మోహన్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ మాజీ ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో మూడు రాజధానులు పేరుతో జగన్ చేసిన హడావుడిపైనా ఆయన మండిపడ్డారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘హోరెత్తిన ప్రజా గళం’ గీతాన్ని హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ అభివృద్ధిలో బాగా వెనకపడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదని విమర్శించారు. అంతేకాకుండా రాష్ట్రంలో అరాచకాలు, దోపిడీలు బాగా పెరిగిపోయానని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన నాయకుడిని ఎన్నుకున్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం వెనకబడిందని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మంచి నాయకుడైన చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని మురళీ మోహన్ పిలుపునిచ్చారు.