Ap Cabinet నుంచి ముగ్గురు, నలుగురు ఔట్..త్వరలో ముహూర్తం?

by srinivas |   ( Updated:2023-02-17 14:05:27.0  )
Ap Cabinet నుంచి ముగ్గురు, నలుగురు ఔట్..త్వరలో ముహూర్తం?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆయన కేబినెట్‌లో పని చేస్తున్న ముగ్గురు, నలుగురు మంత్రులకు ఉద్వాసన పలుకుతారని తెలుస్తోంది. వారి స్థానంలో కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీలకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ ముగ్గురు, నలుగురు ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు

కాగా సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుటికే రెండుసార్లు కేబినెట్‌ను ఎంపిక చేశారు. తొలి కేబినెట్‌లో ఎంపికైన మంత్రుల్లో ముగ్గురు, నలుగురు మినహా మిగిలిన వారందరినీ రెండో కేబినెట్‌లో తొలగించారు. ఇప్పుడు మూడోసారి కూడా మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు.

రాష్ట్రంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు

ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీలుగా గెలుపొందిన వారిలో ముగ్గురు, నలుగురిని మంత్రి వర్గంలో తీసుకోవాలని భావిస్తున్నారట. పార్టీ కోసం పని చేసి పదవులు రాని కొందరికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చి మంత్రులను చేయలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారట. ఈ మేరకు సీఎం జగన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు!

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కసరత్తు పెంచారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. స్థానిక సంస్థల కోటాలో రామసుబ్బారెడ్డి, వంకా రవీంద్ర, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎస్‌ఎమ్ జియా ఉద్దీన్, నవీన్ నిశ్చల్, జయమంగళ వెంకట రమణ, కుడిపూడి సూర్యనారాయణ, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా రామచంద్రారెడ్డి, పర్వత చంద్రశేఖర్ రెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సుధాకర్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వెన్నుపూస రవీంద్రారెడ్డి పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సమావేశంలో చర్చించి ప్రకటిస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

అన్ని ఎన్నికల్లో విజయకేతనం

కాగా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన అన్ని ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకుని తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకోవాలని సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే సామాజిక వర్గాలుగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

Also Read..

Breaking: చంద్రబాబుకు నోటీసులు.. ఉద్రిక్తత

Advertisement

Next Story