- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్థిక శాఖపై శ్వేతపత్రం సిద్ధం.. రేపు అసెంబ్లీలో విడుదల
దిశ, వెబ్ డెస్క్: ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.ఇందుకు అన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఆర్థికశాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని, ఆదాయ వివరాలను అసెంబ్లీలో స్పష్టం చేయనున్నారు. 2019-24 మధ్య రూ. 1,14,588 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల బిల్లులకు సంబంధించి వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది.రూ. 93 వేల కోట్లు సీఎఫ్ఎంఎస్‌లోకి అప్ లోడ్ చేయలేదని, రూ. 48 వేల కోట్ల మేర బిల్లులు అప్ లోడ్ చేసినా చెల్లింపలు జరపలేదని ప్రభుత్వం గుర్తించింది. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి రూ.19,324 కోట్లు, ఆర్థిక శాఖ రూ. 19,549 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖలో రూ. 14 వేల కోట్లు, మున్సిపల్ శాఖలో రూ.7,700 కోట్లు బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం గుర్తించారు. ఈ మేరకు ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేయనున్నారు.