రేపు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు.. ఫార్మా క్షతగాత్రులకు పరామర్శ

by srinivas |   ( Updated:2024-08-21 15:28:52.0  )
రేపు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు.. ఫార్మా క్షతగాత్రులకు పరామర్శ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం అచ్యుతాపురం వెళ్లనున్నారు. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మాలో రియక్టర్ పేలి ఘోర ప్రమాదం జరిగింది. కంపెనీలోని మొదటి అంతస్తు కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. 50 మందికిపైగా గాయాలుకావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీంతో బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. ఈ మేరకు ఆయన గురువారం విశాఖ జిల్లా అచ్యుతాపురం వెళ్లనున్నారు. ప్రమాదం జరిగిన సెజ్‌ను పరిశీలించనున్నారు. ఘటనపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో చంద్రబాబు మాట్లాడుతున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే ఆదేశించారు. అవసరమైతే విశాఖ, లేదా హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని అధికారులకు సూచించారు.

Advertisement

Next Story