- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలవరం పూర్తిపై చంద్రబాబు ఫోకస్.. కేంద్రం ఎదుట కొత్త ప్రతిపాదన
దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బయల్దేరి వెళ్లారు. శనివారం జరగబోయే నీతి అయోగ్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. పోలవరంలో మరో డయా ఫ్రమ్ వాల్ నిర్మించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు నీతి అయోగ్ సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రతిపాదనలు చేయనున్నారు. పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి సహకరిస్తామని బడ్జెట్ సమావేశంలో కేంద్రప్రభుత్వం ప్రస్తావించింది. దీంతో పోలవరం నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. గతంలో 2014-19 మధ్యలో నిర్మించిన డయా ఫ్రమ్ వాల్.. జగన్ హయాంలో ధ్వంసమైందని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు శ్వేత పత్రం విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టులో మరో డయా ఫ్రమ్ వాల్ నిర్మించాలని నిర్ణయించారు. సాధ్యాసాధ్యాలపై కమిటీని నియమించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే చంద్రబాబుకు ఆ నివేదికను సైతం కమిటీ అందజేసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ఢిల్లీ పర్యటన ఆసక్తిని రేపుతోంది.