AP News:ఈ నెల 27న ఏపీ కేబినెట్ సమావేశం

by Jakkula Mamatha |   ( Updated:2024-08-16 14:34:41.0  )
AP News:ఈ నెల 27న ఏపీ కేబినెట్ సమావేశం
X

దిశ,వెబ్‌డెస్క్:అమరావతిలోని సచివాలయంలో ఈ నెల 27వ తేదీన మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కాగిత రహిత కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగిత రహిత కేబినెట్‌లో భాగంగా మంత్రులకు ఐప్యాడ్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇకపై క్యాబినెట్ సమావేశాలు ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లోనే జరుగుతాయని సీఎం చంద్రబాబు గత క్యాబినెట్‌లో మంత్రులకు తెలిపారు. 2017లోనూ సీఎంగా చంద్రబాబు కాగిత రహిత క్యాబినెట్ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. నేడు ఈ సమావేశం పేపర్ రహితంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సర్క్యూలర్ జారీ చేశారు. ట్యాబ్ ద్వారా కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో టెక్నాలజీకి సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తారనే విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story