Breaking News: ఏపీ బీజేపీ అభ్యర్థుల లిస్టు విడుదల

by srinivas |   ( Updated:2024-03-27 14:46:50.0  )
Breaking News: ఏపీ బీజేపీ అభ్యర్థుల లిస్టు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి పంపిన అభ్యర్థుల జాబితాను పరిశీలించిన బీజేపీ హైకమాండ్ తాజాగా ప్రకటించింది. ధర్మవరం నుంచి వై సత్యకుమార్ పోటీ చేస్తుండగా ఎచ్చెర్ల నుంచి ఎన్ ఈశ్వర్ రావు బరిలోకి దిగనున్నారు. విశాఖ నార్త్ నుంచి పి. విష్ణుకుమార్ రాజు, అరకు- పంగి రాజారావు, అనపర్తి- ఎం శివకృష్ణంరాజు, కైకలూరు- కామినేని శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్- సుజనా చౌదరి, బద్వేల్ - బొజ్జ రోషన్న, జమ్మలమడుగు-సి. ఆదినారాయణ రెడ్డి, ఆదోని-పీవీ పార్థసారథిని ఖరారు చేశారు. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.

కాగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేయనుంది. ఇందులో భాగంగా బీజేపీకి పార్లమెంట్ 6 స్థానాలు, అసెంబ్లీకి 10 సీట్లు కేటాయించారు. జనసేనకు పార్లమెంట్ -2, అసెంబ్లీ 22 స్థానాల్లో పోటీ చేయనుంది. మిగిలిన 143 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

Read More..

ప్రజల సమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యే.. ఎక్కడ చూసిన సమస్యలే..

Advertisement

Next Story