AP: ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేతలు

by Shiva |
AP: ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేతలు
X

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ మరో షాక్ తగిలింది. ఈ మేరకు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ కీలక నేతలు వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు చలుమోలు అశోక్ గౌడ్, పీసీసీ జనరల్ సెక్రెటరీ, దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీగా ఉన్న డీవీఆర్కే చౌదరి, ఇతర దెందులూరు నియోజకవర్గ కీలక నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed