ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే బడ్జెట్ ?

by Rani Yarlagadda |   ( Updated:2024-11-03 03:55:11.0  )
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే బడ్జెట్ ?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు (AP Assemblu Session) ముహూర్తం ఖరారయింది. ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించి.. 10 రోజులపాటు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. నవంబర్ 11న ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగం అనంతరం.. వార్షిక బడ్జెట్ (AP Budget) ప్రవేశపెట్టాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుండగా.. కొత్త బడ్జెట్ ను రూపొందించాలి. ఈ క్రమంలో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. దానితో పాటు.. పలు కీలక బిల్లుల్ని కూడా ఏపీ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ఈసారి జరిగే సమావేశాల్లో బడ్జెట్ తో పాటు సూపర్ సిక్స్ పథకాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. నూతన మద్యం పాలసీ, ఉచిత ఇసుక సరఫరాపై చర్చించనున్నారు.

రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఒకే సంవత్సరంలో రెండుసార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (vote on account budget)ను ప్రవేశపెట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలా చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. చివరిగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు.. వివిధ అంశాలపై వరుసగా శ్వేతపత్రాలను విడుదల చేసింది ప్రభుత్వం.

Advertisement

Next Story

Most Viewed