బీఏసీలో కీలక నిర్ణయాలు... ఈ నెల 16న బడ్జెట్‌

by S Gopi |
బీఏసీలో కీలక నిర్ణయాలు... ఈ నెల 16న బడ్జెట్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈనెల 16న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీఏసీ నిర్ణయించింది. అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. 24 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎసీ నిర్ణయించింది. అంటే తొమ్మిది రోజులపాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇకపోతే ఈ నెల 16న బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయించారు. ఈ ఏడాది రూ. 2లక్షల 60 వేల కోట్లకు పైగా బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్‌లో సంక్షేమంతోపాటు వ్యవసాయం, విద్యా, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చేలా రూపకల్పన చేసినట్లు సమాచారం. అందులోనూ వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రజలను ముఖ్యంగా సామాన్యులను ఆకట్టుకునేలా బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రాధాన్యత ఇచ్చే విధంగా బడ్జెట్ రూపకల్పన దిశగా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. పైగా వచ్చే ఏడాదిలో ఎన్నికల నేపథ్యంలో ఇదే పూర్తి స్థాయి బడ్జెట్‌ కావడంతో దృష్టి సారించింది. ఈ బీఏసీ సమావేశానికి సీఎం వైఎస్ జగన్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేశ్, శాసనసభ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, శాసనసభ వ్యవహారాల సమన్వయ కర్త గడికోట శ్రీకాంత్ రెడ్డి, టీడీపీ శాసనసభ ఉప ప్రతిపక్ష నేత అచ్చెన్నాయుడులు హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed