- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP: ఏపీ పశుసంవర్థక శాఖకు అవార్డుల పంట
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు అవార్డులు వెల్లువెత్తాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు. వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలకు సిల్వర్ స్కొచ్ దక్కగా, వెటర్నరీ టెలి మెడిసిన్ కాల్ సెంటర్, పశువుల వ్యాధి నిర్ధారణ ల్యాబ్స్‌తో పాటుగా ఆంధ్ర గోపుష్టి కేంద్రానికి స్కొచ్ మెరిట్ అవార్డులు వరించాయని చెప్పారు. సీఎం జగన్ ముందుచూపుతో వివిధ రంగాల్లో చేపడుతున్న విప్లవాత్మక సంస్కరణలు, సరికొత్త విధానాల ఫలితంగా రాష్ట్రానికి అవార్డులు క్యూ కడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని విజయసాయిరెడ్డి అన్నారు. అలాగే దేశంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత ముఖ్యంగా స్పెషలిస్టు డాక్లర్ల కొరత నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. జగన్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో జరిగిన భేటీలో రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు త్వరితగతిన అమలు చేయాలని కోరడం ద్వారా తనకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరేదీ ముఖ్యం కాదని మరోమారు స్పష్టం చేశారని అన్నారు.