- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tragic incident:పెళ్లి వేడుకలో ఒక్కసారిగా కుప్పకూలిన యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే?
దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనుమూడి గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్నేహితులతో కలిసి వంశీ అనే యువకుడు వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ క్రమంలో స్టేజీపై పెళ్లి కుమారునికి గిఫ్ట్ అందించిన వెంటనే వంశీ అనే యువకుడు కింద పడి స్పృహ కోల్పోయాడు. దీంతో కింద పడిపోతుండగా పక్కనే ఉన్న స్నేహితులు అతడిని పట్టుకున్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. వివాహ వేడుకలో తమతో ఎంతో సంతోషంగా గడిపిన స్నేహితుడు ఆకస్మికంగా మృతి చెందడం పై వంశీ స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడు వంశీ బెంగళూరులోని అమెజాన్ కంపెనీలో పని చేస్తున్నట్లు అతని స్నేహితులు తెలిపారు. అయితే ఇటీవల వయసుతో సంబంధం లేకుండా గుండె పోటు మరణాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి.
స్నేహితుడి వివాహా వేడుకలో గుండెపోటుతో యువకుడు మృతి
— Telugu Scribe (@TeluguScribe) November 21, 2024
కర్నూల్ జిల్లా కృష్ణగిరి మండలం పెనుమడ గ్రామంలో స్నేహితుడి వివాహ వేడుకలో గిఫ్ట్ ఇస్తూ స్టేజ్ పైనే గుండెపోటుకు గురైన వంశీ అనే యువకుడు.
వంశీని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తోటి స్నేహితులు.. కానీ అప్పటికే గుండెపోటుతో… pic.twitter.com/Ve1Epmf1fI