హీటెక్కిస్తున్న ఏపీ ఎన్నికలు..రంగంలోకి మరో యంగ్ హీరో?

by Jakkula Mamatha |   ( Updated:2024-05-05 12:10:58.0  )
హీటెక్కిస్తున్న ఏపీ ఎన్నికలు..రంగంలోకి మరో యంగ్ హీరో?
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉండటంతో అన్ని పార్టీల నేతలు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. పార్టీల నేతలు గెలుపే లక్ష్యంగా సభలు, సమావేశలు, రోడ్‌షో లతో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం సినీ నటులు ప్రచారంలో జోరు పెంచారు. ఇప్పటికే జనసేనాని గెలుపు కోసం మెగా కుటుంబం నుంచి హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ప్రచారం నిర్వహించారు. ఇక ఇప్పుడు తాజాగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ రంగంలోకి దిగారు.

ప్రచారంలో భాగంగా సాయిధరమ్ తేజ్ విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు లో సందడి చేశారు. ఈ క్రమంలోనే పిఠాపురం తో పాటు మచిలీ పట్నం, కాకినాడలో కూడా ఆయన ప్రచారం చేయనున్నారు. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సాయిధరమ్ తేజ్ గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుని గెలిపించాలని కోరారు. సైకిల్ గుర్తుకే మీ ఓటు అని నినదించారు. ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. ప్రచారంలో తలకు ఎర్రటి తువ్వాలు చుట్టుకొని, మెడలో మరో తువ్వాలు వేసుకున్న సాయిధరమ్ తేజ్ పవన్ లాగే ఉన్నారని మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed