ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..సికింద్రాబాద్‌-విశాఖ వందేభారత్‌‌కు మరో స్టాప్‌...ఎక్కడంటే?

by Jakkula Mamatha |
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..సికింద్రాబాద్‌-విశాఖ వందేభారత్‌‌కు మరో స్టాప్‌...ఎక్కడంటే?
X

దిశ,వెబ్‌డెస్క్:మోడీ సర్కార్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన వందే భారత్‌ రైళ్లు పలు రాష్ట్రాల్లో పరుగులు పెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న వందే భారత్‌ రైళ్లలో ఓ ట్రైన్‌‌కి మరో స్టాప్‌ అదనంగా చేర్చడం జరిగిందంట. సికింద్రాబాద్‌ -విశాఖపట్నం వందే భారత్‌కు సికింద్రాబాద్‌ ట్రైన్‌ ఇక నుంచి ఏపీలోని ఏలూరులో కూడా ఆగనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తాజాగా ప్రకటన విడుదల చేశారు.

విశాఖపట్నం-సికింద్రాబాద్, విశాఖపట్నం వందేభారత్ రైలుకు విజయవాడ నుంచి రాజమండ్రి మధ్యలో ఒక్క స్టాప్ కూడా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఏలూరులో స్టాప్ ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులకు ఇక నుంచి ప్రయాణం సులభతరం కానుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 25 నుంచి వందే భారత్ ట్రైన్ ఏలూరు స్టాఫింగ్ అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ లో ఉదయం 5.05 గంటలకు బయలుదేరి.. ఏలూరుకు 9.49 గంటలకు చేరుకుంటుంది. విశాఖపట్నంలో మధ్యాహ్నం 2.35 గంటలకు బయలుదేరి వందే భారత్ రైలు ఏలూరుకు సాయంత్రం 5.54 గంటలకు వస్తుంది.

Advertisement

Next Story

Most Viewed