రాష్ట్రంలో మరో పాలసీకి శ్రీకారం.. త్వరలోనే అమలు

by srinivas |   ( Updated:2024-11-15 14:40:09.0  )
రాష్ట్రంలో మరో పాలసీకి శ్రీకారం.. త్వరలోనే అమలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో మరో పాలసీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటికే పలు పాలసీలను అమలు చేస్తున్న రాష్ట్ర సర్కార్.. తాజాగా ఐటీ పాలసీని తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు విధి విధానాలను రెడీ చేస్తోంది. ఇందులో భాగంగా ఎంపీ భరత్(Mp Bharat) కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఐటీ పాలసీని తీసుకొస్తు్న్నట్లు స్పష్టం చేశారు. అలాగే టాటాగ్రూప్‌(Tatagroup) ఏపీలో పెట్టుబడులు పెట్టబోతోందని తెలిపారు. 20 వరకు హోటల్స్‌ను ప్రారంభించనున్నామని భరత్‌ తెలిపారు. విశాఖపట్నం(Visakhapatnam)లో 10 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. రుషికొండ ప్యాలస్‌ల(Rushikonda Palaces)పై ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఎంపీ భరత్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed