- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నవంబరు 9న శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
దిశ, డైనమిక్ బ్యూరో : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 10 నుండి 18 వరకు జరుగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు నవంబరు 9వ తేదీ గురువారం అంకురార్పణ జరుగనుంది అని టీటీడీ వెల్లడించింది. ఈ సందర్భంగా ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్షకుంకుమార్చన నిర్వహిస్తారని తెలిపింది. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపడతారని టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
నవంబరు 10న ధ్వజారోహణం
‘శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 10న ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ధ్వజస్థంభ తిరుమంజనం, అలంకారం, ఉదయం 9.10 నుండి 9.30 గంటల మధ్య ధనుర్ లగ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి’అని టీటీడీ వెల్లడించింది.
వాహనసేవల వివరాలు :
10-11-2023 - ధ్వజారోహణం, చిన్నశేషవాహనం.
11-11-2023 - పెద్దశేషవాహనం, హంసవాహనం.
12-11-2023 - ముత్యపుపందిరి వాహనం, సింహవాహనం.
13-11-2023- కల్పవృక్ష వాహనం, హనుమంతవాహనం.
14-11-2023 - పల్లకీ ఉత్సవం, వసంతోత్సవం, గజవాహనం.
15-11-2023- సర్వభూపాల వాహనం, స్వర్ణరథం, గరుడవాహనం.
16-11-2023- సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం.
17-11-2023 - రథోత్సవం, అశ్వ వాహనం.
18-11-2023- పంచమితీర్థం, ధ్వజావరోహణం.