ఏపీ అంగన్‌వాడీల కీలక నిర్ణయం.. ఆ తేదీ నుంచి మరింత ఉధృతం

by srinivas |   ( Updated:2023-12-25 11:24:30.0  )
ఏపీ అంగన్‌వాడీల కీలక నిర్ణయం.. ఆ తేదీ నుంచి మరింత ఉధృతం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో అంగన్ వాడీ ఉద్యమం ఉధృతం అవుతోంది. సమస్యలు పరిష్కరించాలని కొద్దిరోజులుగా అంగన్ వాడీలు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి పిలుపు, హామీ రాకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. డిసెంబర్ 31 వరకు చూసి.. ఆ తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలో అంగన్ వాడీ యూనియన్ నేతలు సమావేశం నిర్ణయించారు. అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాలు 14 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రాడ్యూటీతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు.

కాగా తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్ వాడీ కార్యకర్తలు, హెల్పర్లు 14 రోజులుగా సమ్మెకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సీడీసీవో కార్యాలయాలు, మండల కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు లక్షకు పైగా అంగన్ వాడీలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed