- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శవాలపై పేలాలు ఏరుకునే పార్టీకి రేపు ఇంకెవరో..? వైరల్ అవుతున్న పోస్టర్
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో శవ రాజకీయాలు వేడెక్కాయి. దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమయం దగ్గరపడిన నేపథ్యంలో శవ రాజకీయాలు హల్చల్ చేస్తాయి అని టీడీపీ నేతలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. మొదటగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో మొదలైన శవ రాజకీయాలు నేటీకి ఆంధ్రప్రదేశ్ లో తరుచూ కనిపిస్తున్నాయి విశ్లేషకులు పేర్కొంటున్నారు.
గత ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని వార్త వచ్చిన కాసేపట్లోనే కాదు హత్యా చేయబడ్డారని.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు చేశారని వైసీపీ ధ్వజమెత్తింది. అయితే అప్పుడు వివేకా చనిపోవడానికి ఎన్నికలకు కేవలం నెల రోజులు మాత్రమే ఉంది. ఇప్పుడు రానున్న ఎన్నికలకు సమయం దగ్గరపడిన నేపథ్యంలో గీతాంజలి మరణంతో మళ్ళీ శవ రాజకీయాలు మొదలయ్యాయి.
టీడీపీ ట్రోలింగ్ కారణంగానే గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందంటూ అధికార పార్టీ అయిన వైసీపీ ఆరోపిస్తోంది. అయితే ఈ విషయం పై టీడీపీ కూడా ఘాటుగా ప్రశ్నిస్తూ తమకు, గీతాంజలి చావుకు ఎలాంటి సంబంధం లేదని చెప్తోంది. ఇది కూడా బాబాయ్ గుండెపోటు, కోడికత్తి డ్రామా అలాంటిదే అని పదేపదే టీడీపీ పేర్కొంటోంది.
తాజాగా ఇదే విషయంపై టీడీపీ ట్విట్టర్(X) వేదికగా ఓ పోస్టర్ ని విడుదల చేసింది. ఆ పోస్టర్ లో తండ్రి శవం దగ్గర పుట్టిన పార్టీ, శవాలతో ప్రతి ఎన్నికలకూ వెళ్లే వైకాపా పార్టీకి , రేపు ఇంకెవరిదో? అని రాసి జగన్ ఫోటోను ఉంది. కాగా ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read More..
BREAKING: టీడీపీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదలపై చంద్రబాబు కీలక ప్రకటన