- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నాళ్లుగో పెండింగ్‌లో ఉన్న డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు తీపికబురందించింది. 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు అనుమతించింది. అయితే కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేయనున్నట్లు ఉత్తర్వులు విడుదల చేసింది. కాగా 1998లో రాష్ట్రవ్యాప్తంగా 4,534 మంది అభ్యర్థులు డీఎస్సీ క్వాలిఫైడ్ అయ్యారు. వీరందరిని కౌన్సిలింగ్ ద్వారా కాంట్రాక్టుల పద్ధతిలో నియమించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కింది.
సీఎం జగన్‌ను కలిసిన 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు
1998లో డీఎస్సీ క్వాలిఫైడ్ అయ్యి కూడా ఉద్యోగం లేకపోవడంతో గతంలో ఆ అభ్యర్థులు సీఎం జగన్‌ను కలిశారు. తమకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. దీంతో సానుకూలంగా సీఎం స్పందించారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులందరికు కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు ఇచ్చేందుకు అనుమతిచ్చారు. ఈ మేరకు జీవో విడుదల చేశారు. 24 ఏళ్లుగా ఉద్యోగం కోసం ఎదురు చూసిన తమకు సీఎం జగన్ అండగా నిలిచారు. 1998 నుంచి చాలా మంది సీఎంలు మారారని.. కానీ సీఎం జగన్ తమకు ఉద్యోగాలు కల్పిస్తున్నారని అప్పటి డీఎస్సీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు.