Fire Accident: జేసీ దివాకర్ రెడ్డికి చెందిన 2 బస్సులు దగ్ధం

by srinivas |   ( Updated:2025-01-02 03:14:22.0  )
Fire Accident:  జేసీ దివాకర్ రెడ్డికి చెందిన 2 బస్సులు దగ్ధం
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం(Anantapur)లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పార్కింగ్‌లో మంటలు చెలరేగాయి. దీంతో వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో జేసీ దివాకర్ రెడ్డి(JC Diwakar Reddy)కి చెందిన రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు(Private Travel Buses) దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పారు. బస్సుల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదవ శాత్తు ప్రమాదం జరిగిందా..?. ఎవరైనా మంటలు అంటించారా కోణంలో విచారణ చేపట్టారు. స్థానిక సీసీ ఫుటేజులను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story
null