Tragedy: రెండు బైకుల ఢీ.. యువకుడు మృతి

by srinivas |
Tragedy: రెండు బైకుల ఢీ.. యువకుడు మృతి
X

దిశ కళ్యాణదుర్గం: కంబదూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. నూతిమడుగు గ్రామానికి చెందిన యువకుడు అనిల్ తన మిత్రులతో కలిసి పాతపాలెం గ్రామం వెళ్లారు. అక్కడ క్రికెట్ ఆడి తిరిగి బైక్‌పై వస్తుండగా ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో అనిల్‌తో పాటు తన మిత్రులకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అనిల్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed