కళ్యాణదుర్గం టీడీపీలో కీలక పరిణామం.. ఒకటైన ఇద్దరు నేతలు

by srinivas |   ( Updated:2024-02-21 15:05:06.0  )
కళ్యాణదుర్గం టీడీపీలో కీలక పరిణామం.. ఒకటైన ఇద్దరు నేతలు
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నువ్వా నేనా అన్న టీడీపీ నేతలు ఇప్పుడు ఒక్కటయ్యారు. త్వరలో ఎన్నికలు వస్తుండటంతో సీటు కోసం పోటీ పడిన ఇద్దరు నేతలు రాజీ అయ్యారు. అయితే సీటు ఇద్దరిలో ఎవరికి వచ్చినా సరే కలిసి పని చేయాలని ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా కళ్యాణదుర్గం సీటు ఎవరికి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కాగా కళ్యాణదుర్గం టీడీపీలో మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి, టీడీపీ ఇంచార్జి మాదినేని ఉమా మహేశ్వర నాయుడు మధ్య ఉన్న వర్గ విభేదాలు తొలిగిపోయాయి. మరికొన్ని నెల్లలో ఎన్నికలు వస్తుండటంతో ఈ నియోజకరవర్గంలో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యర్థిగా మరో వ్యక్తి సురేంద్ర బాబును రంగంలోకి దింపేందుకు టీడీపీ అధినేత ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో హనుమంతరాయ చౌదరి, మాదినేని ఉమామహేశ్వర నాయుడు అప్రమత్తమయ్యారు. ఇద్దరిలో ఎవరికో ఒకరికి సీటు దక్కించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇన్నాళ్లు ఉన్న వర్గవిభేదాలను పక్కట బెట్టారు. కళ్యాణదుర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో ఒకే వేదికపై కనిపించారు. రెండు వర్గాలుగా ఇన్నాళ్లు విడివిడిగా పని చేసినా పార్టీ కోసం ఇద్దరం ఒక్కటయ్యారు. టికెట్ ఎవరికి వచ్చినా టీడీపీ గెలుపు కోసం పని చేస్తామని చెప్పారు. అయితే వీళ్లిద్దరి టార్గెట్ సురేంద్రబాబుగా కనిపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు టికెట్ దక్కకుండా వారి పనిగా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతోందో చూడాలి.

Read More..

మీడియాపై ప్రభుత్వ దమన కాండను అడ్డుకోవాలి..

Advertisement

Next Story