Obulapuram: రెండు ఆటోలు బోల్తా.. 10 మందికి గాయాలు..ముగ్గురి పరిస్థితి విషయం

by srinivas |   ( Updated:2023-03-13 14:06:31.0  )
Obulapuram: రెండు ఆటోలు బోల్తా.. 10 మందికి గాయాలు..ముగ్గురి పరిస్థితి విషయం
X

దిశ, రాయదుర్గం: అనంతపురం జిల్లా డి. హిరేహల్ మండలం ఓబులాపురం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు- బళ్లారి జాతీయ రహదారిపై రెండు ఆటోలు ఓవర్టేక్ చేస్తూ బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో పదిమంది వ్యవసాయ కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కర్ణాటకలోని బళ్ళారి విమ్స్ వైద్యశాలకు తరలించారు.


వ్యవసాయ కూలీలు బళ్లారి జిల్లా శంకర్ బండ గ్రామంలో పనులకు వెళ్లి తిరిగి డి హీరేహాల్ వైపు వెళ్తున్నారు. ఈ సమయంలో కూల్ డ్రింక్స్ రవాణా చేస్తున్న ఆటో వేగంగా వచ్చి కూలీల ఆటోను ఢీకొట్టింది. దీంతో రెండు ఆటోలు జాతీయ రహదారిపై బోల్తా పడ్డాయి. క్షతగాత్రులు కర్ణాటకలోని పైకనుమ, మల్లాపుర, కోనాపురం గ్రామాలకు చెందిన కూలీలుగా గుర్తించారు. డి హీరేహళ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story